జేపీ చెరువులో జోరుగా అక్రమ మద్యం | - | Sakshi
Sakshi News home page

జేపీ చెరువులో జోరుగా అక్రమ మద్యం

Jun 27 2026 1:25 AM | Updated on Jun 27 2026 1:25 AM

జేపీ చెరువులో జోరుగా అక్రమ మద్యం

పత్తా లేని ఎకై ్సజ్‌ అధికారులు

రాచర్ల: రాచర్ల మండలం జేపీ చెరువులో బెల్టుషాపుల దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలను పక్కనబెట్టి, అనుములపల్లె వైన్స్‌ యజమానులు అక్రమంగా మద్యం బాక్సులను ఆటోల్లో తరలిస్తూ గ్రామాల్లో విక్రయిస్తున్నారు. మొహర్రం పండుగ సందర్భంగా శుక్రవారం మద్యం సరఫరా జోరుగా సాగింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ఎంఆర్పీ కంటే రూ.50 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుండటంతో నిత్యం గొడవలు జరుగుతున్నాయని, తమకు ప్రశాంతత కరువైందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ దందాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గిద్దలూరు ఎకై ్సజ్‌ సీఐకి వినతిపత్రం అందజేసినా స్పందన కరువైంది. ఎకై ్సజ్‌, పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి, బెల్టుషాపులను శాశ్వతంగా మూసివేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement