● ఆపరేటర్ మృతి
చీమకుర్తి రూరల్: జేసీబీపై గ్రానైట్ రాయి పడి దాని ఆపరేటర్ మృతిచెందిన సంఘటన చీమకుర్తి మండలంలోని రామతీర్థం వద్ద ఉన్న వాసవీ గ్రానైట్ క్వారీలో గురువారం చోటుచేసుకుంది. క్వారీలో జేసీబీ మిషన్‌తో గ్రానైట్ షీట్ (రాయి)ను కిందపడేసేందుకు ఎదురు నుంచి లాగుతుండగా ఒక్కసారిగా జేసీబీ మిషన్‌పై ఆ షీట్ పడింది. దీంతో జేసీబీ ఆపరేటర్ మహేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతను జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. హుటాహుటిన అదే క్వారీలో ఉన్న ఆరు జేసీబీ మిషన్ల సహాయంతో గ్రానైట్ షీట్‌ను పక్కకు తొలగించారు. మహేష్ యాదవ్ మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


