● అందజేసిన జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
ఒంగోలు సిటీ: జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలో పనిచేస్తూ మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అందజేశారు. 8 మందిని ఆఫీస్ సబార్డినేట్లుగా, ఐదుగురిని జూనియర్ సహాయకులుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు అందించారు. గుంజి శ్రీదేవిని కరవది జెడ్పీ హైస్కూల్‌కు, ఎస్.పవన్‌గణేష్‌ను ఇనమనమెల్లూరు జెడ్పీ హైస్కూల్‌కు, పల్లెపోగు స్వప్నను ఈస్ట్ గంగవరం జెడ్పీ హైస్కూల్‌కు, జి.అమోష్‌బాబును తర్లుబాడు ఎంపీడీఓ కార్యాలయానికి, ఆర్.ఆదిలక్ష్మిని గుడ్లూరు ఎంపీపీకి, సీహెచ్ హనూక్‌ను దొనకొండ ఎంపీడీసీఓ కార్యాలయానికి, ఎస్‌కే జాకీర్‌హుస్సేన్‌ను కొత్తపట్నం ఎంపీపీకి, డి.రసూల్‌బాషాను కొమరోలు ఎంపీపీలో ఆఫీస్ సబార్డినేట్లుగా నియమించారు. అలాగే జూనియర్ సహాయకులుగా ఏ సుభాష్‌కీర్తిని ఈపూరుపాలెం జెడ్పీ హైస్కూల్‌కు, ఎ.వెంకటసాయి యశ్వంత్‌ను పోకూరు జెడ్పీ హైస్కూల్‌కు, బి.మురళీకృష్ణను చినగంజాం ఎంపీపీకి, పి.వాసవ్‌కుమార్‌ను కారంచేడు ఎంపీపీకి, ఎన్.సాయి చరణ్‌ను బి.పేట ఎంపీపీకి నియమించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీవైఈఓ పి.బాలమ్మ పాల్గొన్నారు.


