ఏసీబీ సోదాలతో ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని టౌన్ ప్లానింగ్ విభాగం భవనం ఖాళీ అయింది. 13 మంది ఇళ్లలో సోదాలు జరుగుతుండటంతో మిగతా సిబ్బంది కూడా కార్యాలయానికి రాకుండా డుమ్మా కొట్టారు. సర్వేయర్ కూడా కార్యాలయంలో లేరు. ప్రజలు మాత్రం కార్యాలయం చుట్టూ తిరిగి ఎవరూ లేకపోవటంతో అర్ధంగాక వెనుదిరిగారు. టౌన్ ప్లానింగ్ విభాగంతో పాటు ఇంజినీరింగ్, పారిశుధ్యం, రెవెన్యూ విభాగాలకు చెందిన ముఖ్య అధికారులు కూడా కార్యాలయానికి డుమ్మా కొట్టారు. కమిషనర్ వెంకట కృష్ణయ్య నూతనంగా వచ్చి విధులు నిర్వర్తిస్తుండటంతో ఆయన మాత్రం కార్యాలయంలోనే తన పనులు తాను చేసుకుంటూ కనిపించారు.


