● 20 సవర్ల బంగారు ఆభరణాలు
అపహరణ
మేదరమెట్ల(అద్దంకి): తాళం వేసిన గృహంలో చోరీ జరిగిన ఘటన కొరిశపాడు మండలంలోని మేదరమెట్లలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. మేదరమెట్ల గ్రామంలో కొల్లా శ్రీలక్ష్మి అనే మహిళ నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఇంటికి తాళం వేసి పుట్టిల్‌లైన పర్చూరు మండలంలోని వీరన్నపాలెం గ్రామానికి వెళ్లింది. తిరిగి గురువారం ఇంటికి చేరుకుంది. తలుపు తీసి చూడగా, ఇంటి వెనుక వైపున ఉన్న గ్రీల్స్‌కు వేసిన తాళం పగులగొట్టి ఉంది. దుండగులు అటు నుంచి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 20 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించినట్లు గుర్తించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..చోరీ జరిగిన గృహాన్ని ఎస్సై రఫీ పరిశీలించారు. క్లూస్‌టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలుగొండ ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్థన్‌రాజు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని గంటవానిపల్లె వద్ద ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. జేసీ పులి శ్రీనివాసులుతో కలిసి హెలిప్యాడ్, నిర్వాసితుల సభా వేదికను పరిశీలించారు. మార్కాపురం, దర్శి డీఎస్పీలు నాగరాజు, బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


