పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది పెదారికట్ల ప్రభుత్వ హోమియో వైద్యశాల పరిస్థితి. సుమారు 51 ఏళ్లుగా చుట్టుపక్కల నాలుగు గ్రామాల ప్రజలకు వైద్యసేవలందిస్తున్న ఈ ఆసుపత్రి, ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యంతో మూతపడింది. రెండేళ్ల క్రితం ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్‌ను బదిలీ చేశారు. ఆ తర్వాత ఉన్న ఏకై క కాంపౌండర్‌కు డిప్యూటేషన్ పేరుతో మన్నేపల్లికి పంపారు. దీంతో అప్పటి నుంచి వైద్యశాలకు తాళం పడింది. గదిలోనే మందులు నిరుపయోగంగా మగ్గిపోతున్నాయి. ఐదు నెలల క్రితం ’సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించిన ఆయుష్ శాఖ ఉపసంచాలకులు.. వైద్యశాలలను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.


