● ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
జె.పంగులూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని జాగర్లమూడివారిపాలెంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ డౌన్‌లో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుడ్లూరుకు చెందిన గద్దె కార్తీక్ (23), హని, సునీల్ యాదవ్ ముగ్గురు ఒకే బైక్‌పై ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళుతున్నారు. మండల పరిధిలోని జాగర్లమూడివారిపాలెం జాతీయ రహదారిపై ఫైఓవర్ పై నుంచి కిందకి దిగుతూ ఒక్కసారిగా వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వెనుక వస్తున్న టాటా ఏసీ వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో గద్దె కార్తీక్(23) అక్కడికక్కడే మృతి చెందగా హనీ, సునీల్ యాదవ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై రేణింగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


