మహిళా క్రికెటర్ల ఎంపికకు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెటర్ల ఎంపికకు విశేష స్పందన

Jun 25 2026 12:48 AM | Updated on Jun 25 2026 12:48 AM

మహిళా క్రికెటర్ల ఎంపికకు విశేష స్పందన 27న సీఎం వెలిగొండ పర్యటన కంభంలో చోరీ డీపీఓగా అనుపమ

ఒంగోలు: జిల్లా మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలను బుధవారం నిర్వహించగా విశేష స్పందన లభించింది. స్థానిక మంగమూరు రోడ్డులోని ఏసీఏ సబ్‌ సెంటర్స్‌లో మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించింది. అండర్‌ 19, 23 విభాగాల్లో ఈ ఎంపిక నిర్వహించగా, బ్యాటింగ్‌, బౌలింగ్‌, వికెట్‌ కీపింగ్‌, ఫీల్డింగ్‌ అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు ప్రకాశం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపికై న అండర్‌ 19 జట్టు జూలై 4 నుంచి 9వ తేదీ వరకు మంగళగిరిలో పశ్చిమగోదావరి, విజయవాడ, గుంటూరు జట్లతో తలపడుతుందన్నారు. ఈ ఎంపికను చీఫ్‌ సెక్రటరీ, సీనియర్‌ క్రికెటర్‌ పీవీ సుధారాణి పర్యవేక్షించారు. ఎంపిక ప్రక్రియను పరిశీలించిన వారిలో రిమ్స్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నామినేని కిరణ్‌కుమార్‌, క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి బొచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, రాము, నాదెండ్ల శ్రీను, కోచ్‌ లెఫ్ట్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల: ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో కలెక్టర్‌ విజయ సునీత, ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఘంటవానిపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌, సభాప్రాంగణం వద్ద భద్రతా పరమైన అంశాలు, వసతులపై కలెక్టర్‌, ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులు, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ అబూతాలిమ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కంభం: కంభంలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయ సమీపంలో నివాసం ఉంటున్న మాజీ సైనికుడు పి.శ్రీనివాసులు బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి మార్కాపురం వెళ్లాడు. 11 గంటల సమయంలో ఇంట్లో నుంచి శబ్దాలు వస్తుండటంతో గమనించిన పైఇంటి వారు వచ్చి చూసేసరికి దొంగలు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గృహాన్ని పరిశీలించగా, ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన దొంగలు బీరువా తాళాలు పగలగొట్టడాన్ని గుర్తించారు. రూ.5 వేల నగదు, వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు తెలిసింది. మార్కాపురం క్లూజ్‌టీమ్‌ వారు వచ్చి వేలిముద్రలు సేకరించారు.

ఒంగోలు సబర్బన్‌: జిల్లా పంచాయతీ అధికారిగా (డీపీఓ) ఎం.అనుపమ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ పి.రాజాబాబును మర్యాద పూర్వకంగా కలిసి మొక్క బహూకరించారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న అనుపమ 2007 గ్రూప్‌–1 బ్యాచ్‌కి చెందిన అధికారిణి. 2025లో పదోన్నతి పొందిన ఆమె ఏలూరు జిల్లాలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో పనిచేశారు. బదిలీపై ప్రకాశం జిల్లా డీపీఓగా బాధ్యతలు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement