ఒంగోలు సబర్బన్: భారతీయ కిసాన్ సంఘటన్ (బీకేఎస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో కన్వీనర్‌గా ధారా రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు భారతీయ కిసాన్ సంఘటన్ నేషనల్ జనరల్ సెక్రటరీ యర్రం వెంకటరెడ్డి బుధవారం నియామక పత్రం అందించారు. ఒంగోలుకు చెందిన ధారా రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ భారతంలో విస్తరణ దిశగా దేశంలోని ప్రముఖ ప్రజాస్వామ్య రైతు సంస్థ రైతుల సమగ్ర అభివృద్ధి, స్వాలంబన దిశగా ముందుకు పోతున్నామన్నారు.
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్‌గా (ఎంపీహెచ్‌ఏ, ఫిమేల్)గా విధులు నిర్వహిస్తున్న 79 మందికి మల్టీపర్పస్ హెల్త్ సూపర్‌వైజర్స్‌గా (ఎంపీహెచ్‌ఎస్) పదోన్నతి లభించింది. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితోపాటుగా హెడ్‌నర్సులుగా పనిచేస్తున్న నలుగురికి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌లుగా, హెల్త్ ఎడ్యుకేటర్‌గా పనిచేస్తున్న ఒకరికి డెమోగా పదోన్నతి ఇచ్చారు. కౌన్సిల్ ప్రక్రియలో ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డీడీ బండి పాల్ సుధాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్ సత్యం, సీనియర్ అసిస్టెంట్ బూసి శ్యామ్ అనిల్ పాల్గొన్నారు.


