న్యూస్‌రీల్
ఒంగోలు నగరపాలక సంస్థలో అవినీతి కంపుకొడుతోంది. చెత్త సేకరణ పేరుతో భారీ ఎత్తున దందా జోరుగా సాగుతోంది. నగరంలోని వేలాది ఇళ్ల నుంచి ప్రైవేటు ఆటోల ద్వారా నెలనెలా డబ్బులు వసూలు చేస్తూ అధికారులు జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్య విభాగంలోని కొందరు అధికారుల అండదండలతో జరుగుతున్న ఈ దందాలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టు సమాచారం. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామంటున్న అధికారులు, ఆ సంపదను కార్పొరేషన్ ఖజానాకు కాకుండా కొందరి జేబుల్లోకి మళ్లిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


