కూటమి నాయకుల కుట్రలు తిప్పికొట్టాలి | - | Sakshi
Sakshi News home page

కూటమి నాయకుల కుట్రలు తిప్పికొట్టాలి

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

కూటమి నాయకుల కుట్రలు తిప్పికొట్టాలి

పుల్లలచెరువు: కూటమి నాయకుల కుట్రలు తిప్పికొట్టేందుకు వైఎస్సార్‌ సీపీ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. పుల్లలచెరువు రైస్‌ మిల్‌ వద్ద బీఎల్‌ఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సర్‌ ప్రక్రియలో అప్రమత్తంగా లేకుంటే కుట్రలు చేయడంలో ఆరితేరిన చంద్రబాబు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఆ కుట్రను ధైర్యంగా ఎదుర్కొవాలంటే బీఎల్‌ఏలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్‌ ప్రక్రియలో జరిగిన అవకతవకలతోనే దేశంలోని ప్రముఖ వ్యక్తులు ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో పనిచేస్తున్న బీఎల్‌ఏలు తగు సమాచారంతో జాగ్రత్తగా ఉండాలని, ఓట్ల విషయంలో పకడ్బందీగా లేకుంటే ఓట్లు తొలగించేందుకు కూటమి నాయకులు కుట్రలు చేసే అవకాశం ఉందన్నారు. ప్రతి బీఎల్‌ఏ తన పరిధిలోని ఓటర్ల వివరాలను సేకరించి ఓట్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. సర్‌ ప్రక్రియ వచ్చిన తరువాత మొదటిసారి స్థానిక ఎన్నికలు ఎదుర్కొవాల్సి వస్తుందని, బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలోని ప్రతి బీఎల్‌ఏ అప్రమత్తంగా ఉంటూ బీఎల్‌ఓను అనుసంధానం చేసుకుంటూ ఓట్లు అన్ని ఉండేలా చూడాలన్నారు. వైఎస్సా ఆర్‌ సీపీ అధికారంలోకి రావాలంటే బీఎల్‌ఏలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, టీడీపీని ఇంటికి పంపేందుకు ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలకు మారు పేరుగా ఉన్న కూటమి నాయకుడు చంద్రబాబు చేసే పనులకు ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా తండ్రీ, కొడుకు విహారయాత్రలు చేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రతి మండలకేంద్రంలో సర్‌ ప్రక్రియకు సంబంధించి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

87 కేంద్రం బీఎల్వోపై ఫిర్యాదు

పుల్లలచెరువు మండలంలోని 87 పోలింగ్‌కేంద్రంలో పనిచేస్తున్న బీఎల్వో ఆ కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ పార్టీ తరపున పనిచేస్తున్న బీఎల్‌ఏకు సమాచారం ఇవ్వకుండా విధులు నిర్వహించిన విషయం స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే స్పందించి బీఎల్‌ఓతో ఫోన్‌లో మాట్లాడారు. బీఎల్‌ఏ సంతకం ఉండాలని తనకు తెలియదని, తాను బీఎల్‌ఏను సంప్రదించకుండా పనిచేశానని, ఆ విషయం తనకు తెలియదని ఎమ్మెల్యేకు తెలిపింది. సర్‌ ప్రక్రియకు సబంధించిన విషయాలు తెలుసుకోకుండా బీఎల్వోగా ఏలా పనిచేస్తున్నావని ఎమ్మెల్యే ప్రశ్నంచారు. ఈ విషయంపై ఈఆర్‌వో వద్ద ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సదస్సుకు పార్టీ మండల అధ్యక్షుడు దోమకాలు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ఎస్‌ఐఆర్‌ పార్టీ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా సభ్యుడు పత్తి రవిచంద్ర, నియోజికవర్గ బూత్‌ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు సుబ్బారెడ్డి బీఎల్‌ఏలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ వింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్‌ జాయింట్‌ సెక్రటరీ ఎల్‌.రాములు, జిల్లా కార్యవర్గసభ్యుడు కె.రఘు, నాయకులు కోటిరెడ్డి, రమణారెడ్డి, రవణమ్మ, కాశయ్య, హరినాయక్‌, శంకర్‌రెడ్డి, కాశయ్య, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి

సర్‌ ప్రక్రియపై జాగ్రత్తలు అవసరం

ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement