ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

Jun 22 2026 1:54 AM | Updated on Jun 22 2026 1:54 AM

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

అద్దంకి: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణంలోని పోతురాజు గండి ప్రాంతంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కావలి గ్రామానికి చెందిన ఎస్‌ నందు(22) గత నాలుగేళ్లుగా వివాహాది శుభకార్యాల ఈవెంట్లలో పొల్గొని జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా తనతో పాటు ఈవెంట్లలో పాల్గొనే విజయవాడకు చెందిన యువతితో కలిసి పట్టణంలోని పోతురాజు గండి ప్రాంతంలో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. దీంతో ఇద్దరో చెరో బెడ్‌రూంలో నిద్రించారు. ఉదయాన్నే లేచిన ఆ యువతి నందు రూం తలుపుకొట్టగా ఎంతకూ తీయపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. వారు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టి చూడగా నందు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న బంధువులకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement