ఇద్దరు యువకుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు యువకుల దుర్మరణం

Jun 22 2026 1:54 AM | Updated on Jun 22 2026 1:54 AM

ఇద్దరు యువకుల దుర్మరణం

మేదరమెట్ల: లారీని బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మేదరమెట్ల ఉత్తర బైపాస్‌ ప్రాంతంలోని కొండ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..కందుకూరుకు చెందిన శ్రీరామచక్రి(22), ఓగూరుకు చెందిన చిట్టాల గోపీ(26)తో కలిసి మోటార్‌ బైక్‌పై విజయవాడ అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. వీరు మేదరమెట్ల ఉత్తర బైపాస్‌ కొండ ప్రాంతానికి రాగానే ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొన్నారు. ప్రమాదంలో శ్రీరామచక్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో చిట్టాల గోపీ తీవ్రంగా గాయపడగా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై మహ్మద్‌ రఫీ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శ్రీరామచక్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

లారీని ఢీకొన్న బైక్‌

మేదరమెట్ల కొండ సమీపంలో ప్రమాదం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement