పశువులకు కృత్రిమ గర్భధారణ మేలు | - | Sakshi
Sakshi News home page

పశువులకు కృత్రిమ గర్భధారణ మేలు

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

పశువులకు కృత్రిమ గర్భధారణ మేలు

ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు

కొత్తపట్నం: పశువులకు మేలైన కృత్రిమ గర్భధారణ చేయడం వలన రైతుకు ఆర్థికంగా లాభం చేకూరడమే కాకుండా పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. కొత్తపట్నం మండలంలోని ఆలూరు గ్రామంలో శనివారం లింగనిర్ధారిత వీర్యం ద్వారా గర్భం దాల్చిన చూడి పశువుల ప్రదర్శన నిర్వహించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పశుసంవర్థకశాఖ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. లింగ నిర్ధారిత వీర్యం ద్వారా పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించడం వలన 90 శాతం కచ్చితత్వంతో కేవలం పెయ్యి దూడలే పుడతాయని, తద్వారా పాడి రైతులకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని తెలిపారు. శాసీ్త్రయ పునరుత్పత్తి విఽధానం ద్వారా సంతానయోగ్యమైన ప్రతి పశువుకు వ్యక్తిగత పర్యవేక్షణలో చూలు కట్టించడం, క్రమబద్ధమైన ఈతలను పొందడం ద్వారా అధిక పాల ఉత్పత్తి సాధించడానికి పశువులు కేంద్రీకృత పునరుత్పత్తి నిర్వహణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. ప్రకాశం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక అధికారి డాక్టర్‌ బి.మురళీకృష్ణ మాట్లాడుతూ శాసీ్త్రయ పునరుత్పత్తి విధానం పాటించకపోవడం వలన యుక్త వయసుకు వచ్చిన పడ్డలు సకాలంలో గర్భం ధరించకపోవడం, పశువుల ఈతల మధ్య వ్యవధి పెరగడం వలన పాడి రైతులకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని తెలిపారు. త్రోవగుంట పశువైద్యశాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ బి.బసవశంకరరావు మాట్లాడుతూ ఈనిన ప్రతి పశువుతో మళ్లీ 45 నుంచి 60 రోజుల్లోగా శాసీ్త్రయంగా చూలు కట్టించి ఈతల మధ్య వ్యవధి తగ్గించడం ద్వారా పాడి వైతులకు ఆర్థిక స్వావలంబన కలుగుతుందని తెలిపారు. పశు ప్రదర్శనలో మండలంలోని ఆలూరు, గాదెపాలెం, బీరంగుంట, గుత్తికొండవారిపాలెం గ్రామాలకు చెందిన లింగ నిర్ధారిత వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణ పొందిన 68 చూడి పశువులను ఉంచారు. పాడి రైతులకు బలవర్థక మందులు, ఖనిజ లవణ మిశ్రమం, కాల్షియం, టానిక్‌, నట్టల నివారణ మందులు, పాల క్యాన్లను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ ఒంగోలు డివిజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.జగత్‌ శ్రీనివాస్‌, ప్రాంతీయ పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఒంగోలు ఉపసంచాలకులు డాక్టర్‌ సంధ్య, పశువుల ఉత్పత్తి కేంద్రం చదలవాడ సంచాలకులు డాక్టర్‌ బి.రవి, ఈతముక్కల, అల్లూరు, యరజర్ల పశువైద్యాధికారులు సీహెచ్‌ అమూల్య, ఎం.సోమశేఖర్‌, డాక్టర్‌ వై.భూపాల్‌, డాక్టర్‌ యు.ఆశ, వెటర్నరీ లైవ్‌ స్టాక్‌ ఆఫీసర్లు కె.లక్ష్మయ్య, టీవీ రమణమ్మ, కొత్తపట్నం, ఒంగోలు మండలాల పశువైద్య సిబ్బంది, వివిధ కంపెనీల ఫార్మ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement