చీమకుర్తి రూరల్: అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 10 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చీమకుర్తి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్ సీఐ సుకన్య తెలిపారు. శనివారం చీమకుర్తి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని సంతనూతలపాడు మండలం కొనగానివారిపాలెంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నల్లమోతు శ్రీనివాసరావు నుంచి 10 బాటిళ్లు స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.
టంగుటూరు: వందేభారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన టంగుటూరులోని ఎల్‌సీ 191 గేటు ఉత్తరం వైపు శనివారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ టి.శ్రీరామ్ తెలిపిన వివరాల మేరకు.. సుమారు 30 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తిని వందేభారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు మెరూన్ కలర్ అరచేతుల నెక్ టీ షర్ట్, నీలిరంగు జీన్స్ ప్యాంటు, కుడిచేతికి కడియం ధరించి ఉన్నాడు. ఎత్తు సుమారు 5.5 అడుగులతో చామన చాయలో ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని శ్రీరామ్ కోరారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా అండర్ 19, అండర్ 23, సీనియర్ మహిళా క్రికెట్ జట్లను ఈ నెల 23వ తేదీ ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని క్రీడాకారులు అర్హులని అన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 8.30 గంటలకు స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్‌లో జరిగే ఎంపికకు నేరుగా హాజరుకావాలని సూచించారు. క్రీడాకారులు తప్పనిసరిగా కలర్ డ్రస్, షూ, సొంత కిట్, జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5), ఆధార్‌కార్డు, స్టడీ సర్టి ఫికెట్‌తో హాజరుకావాలని కోరారు. ఎంపికై న జట్లు జూలైలో మంగళగిరి, పేరేచర్లలో జరిగే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెంట్రల్ జోన్ అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు కోచ్ పి.శ్రీనివాస్ (9573424360), బి.చంద్రశేఖర్ (9246222999)ను సంప్రదించాలని నాగేశ్వరరావు తెలిపారు.


