ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్‌

ఒంగోలు:

జాతీయ లోక్‌ అదాలత్‌ జూలై 11న జరుగుతుందని, అందులో జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎ.సత్యానంద్‌ కోరారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో బ్యాంకు అధికారులు, సంబంధిత బ్యాంకుల న్యాయవాదులతో జాతీయ లోక్‌ అదాలత్‌పై ఆయన చర్చించారు. కక్షిదారులు జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేందుకు బ్యాంకు అధికారులు కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వి.పల్లవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌వీ రామకృష్ణ, న్యాయవాదులు బొడ్డు రామలింగం, రహీంబేగ్‌, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement