కురిచేడు:
స్కూల్ బస్సు – బైకు ఎదురెదురుగా ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కురిచేడులోని దర్శి రోడ్డులో అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా శనివారం చోటుచేసుకుంది. కురిచేడు మండలంలోని నమశ్శివాయపుర అగ్రహారం గ్రామానికి చెందిన బరిగే బాలయ్య (62) దర్శి రోడ్డులోని పెట్రోలు బంకులో తన ద్విచక్ర వాహనానికి పెట్రోలు పోయించుకుని వస్తున్నాడు. అదే సమయంలో స్థానిక హుస్సేనియ పాఠశాల బస్సు కురిచేడు నుంచి దర్శి రోడ్డులోని పాఠశాలకు వెవెళ్తోంది. రోడ్డు దాటే క్రమంలో ఎదురెదురుగా వచ్చిన బస్సు – ద్విచక్ర వాహనం ఽఢీకొన్నాయి. ఈ ఘటనలో బాలయ్య తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కురిచేడులోని పోలీసుస్టేషను వెనుక వైపు నివసిస్తున్న బాలయ్యకు భార్య, వివాహమైన కుమార్తె ఉన్నారు.


