న్యూస్‌రీల్
ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో కోట్ల విలువైన సహజ సంపదను పెద్ద ఎత్తున దోచేస్తున్న పచ్చమంద జోలికి వెళ్లని మైన్స్ అధికారులు తప్పుడు ఫిర్యాదులను ఆసరా చేసుకుని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీలపై వరుస తనిఖీలు చేస్తూ కోట్ల రూపాయల పెనాల్టీలు విధించారు. అన్ని అనుమతులూ ఉన్నా రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతూ ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారు. రాజకీయ విభేదాలతో గ్రానైట్ పరిశ్రమలను లక్ష్యంగా చేసుకోవడంపై పరిశ్రమ వర్గాలు మండిపడుతున్నాయి.
సూర్య గ్రానైట్ క్వారీలో తనిఖీలు చేస్తున్న మైన్స్ అధికారులు (ఫైల్)


