సర్‌ పకడ్బందీగా నిర్వహించండి | - | Sakshi
Sakshi News home page

సర్‌ పకడ్బందీగా నిర్వహించండి

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

కల్టెర్‌ విజయసునీత

మార్కాపురం: సర్‌ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ విజయసునీత ఆదేశించారు. తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి సచివాలయాన్ని ఆకస్మికంగా గురువారం నిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివాదాలకు, విమర్శలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా సర్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. సచివాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి రాకుండా హాజరు నమోదు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ సేవల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement