న్యూస్‌రీల్
పాతాళానికి పడిపోయిన పసుపు ధరలు మోంథా తుఫాన్ ధాటికి తగ్గిన పసుపు దిగుబడులు గిట్టుబాటు ధరలు కూడా లేక నష్టపోతున్నామంటున్న రైతులు రెండు నెలల క్రితం రూ.15 వేలు ఉన్న క్వింటా పసుపు ప్రస్తుతం రూ.12 వేలకు పడిపోయిన వైనం ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న పసుపు రైతులు ఎరువుల కొరతతో పెరిగిన పెట్టుబడులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 900 ఎకరాల్లో పసుపు సాగు మొదలైన పసుపు తవ్వకాలు
పెరిగిన పెట్టుబడులకు తోడు ప్రకృతి వైపరీత్యాలతో తగ్గిన దిగుబడులు, దిగజారిన ధరలతో పసుపు రైతుల జీవితాలు వెలవెలబోతున్నాయి. అష్టకష్టాలు పడి పంట పండించినా తీరా పంట చేతికొచ్చే సరికి ధరలు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మోంథా తుఫాన్ దాటికి పంట దెబ్బతిని నేటికీ నష్టపరిహారం అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రస్తుతం పతనమైన ధరలు మరింత నష్టాన్ని చేకూరుస్తున్నాయి.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఎకరా పొలంలో పసుపు సాగు చేశాను. రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టాను. పసుపు తవ్వితే దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. ధరలు కూడా తగ్గిపోవడంతో పసుపు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
– అబ్దుల్ రహమాన్, పసుపు రైతు, కంభం
గిట్టుబాటు ధరలు కల్పించండి
ఈ ఏడాది మోంథా తుఫాన్ ధాటికి పసుపు పంటతో పాటు ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం నేటికీ నష్టపరిహారం అందించకపోవడం బాధాకరం. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు పసుపునకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలి.
– నెమలిదిన్నె చెన్నారెడ్డి, కంభం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్
మోంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న పంట
పెట్టుబడులు కూడా రాలేదు
అర ఎకరా పొలంలో పసుపు వేశాను. పంట బాగుందని అనుకున్న సమయంలో మోంథా తుఫాన్ రావడంతో పంట మొత్తం నీళ్లల్లో మునిగిపోయి పూర్తిగా దెబ్బతింది. దీంతో పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోయాం.
– షేక్ మహబూబ్ వలి, పసుపు రైతు, కంభం


