మార్కాపురం టౌన్: పోస్టల్ ఏజెంట్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు మార్కాపురం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై న ఆర్ నర్సింహులు తెలిపారు. పట్టణంలోని గాంధీ బజారులో ఉన్న కల్యాణ రామస్వామి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన జిల్లా పోస్టల్ ఏజెంట్ల సమావేశంలో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షునిగా జీ విశ్వనాథం, ప్రధాన కార్యదర్శిగా డీ రామశేఖర్, కోశాధికారిగా జే సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా మువ్వల వెంకటేశ్వర్లు, ఎస్ రవికుమార్, పీ సుధీర్, జాయింట్ సెక్రటరీగా కే హరనాథ్‌తోపాటు 9 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
కనిగిరిరూరల్: పట్టణానికి చెందిన ఎస్‌కే జవహర్ జాతీయ స్థాయి యోగా శిక్షణలో ప్రతిభ చాటారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) ఆధ్వర్యంలో పంజాబ్‌లోని పటియాలలో ప్రతిష్టాత్మక నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్)లో నిర్వహించిన ఆరు వారాల జాతీయ స్థాయి యోగా శిక్షణలో జవహర్ అత్యున్నత ప్రదర్శన కనబరిచారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యోగా క్రీడా శిక్షకులతో పోటీపడి, యోగాసనాల విభాగంలో ఏ గ్రేడ్ సాధించినట్లు తెలిపారు.


