11న జ్యోతిబా పూలే జయంత్యుత్సవాలు | - | Sakshi
Sakshi News home page

11న జ్యోతిబా పూలే జయంత్యుత్సవాలు

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

11న జ్యోతిబా పూలే జయంత్యుత్సవాలు సీ్త్ర నిధి రుణాలు మంజూరు చేయాలి

మార్కాపురం టౌన్‌: మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంత్యుత్సవాలను ఈ నెల 11వ తేదీ మార్కాపురంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ విజయసునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురంలోని తర్లుపాడు రోడ్డులో విద్యుత్‌ కార్యాలయం వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేయనున్నట్లు చెప్పారు. అలాగే కలెక్టరేట్‌లో కూడా జ్యోతిబా పూలే జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఒంగోలు వన్‌టౌన్‌: సీ్త్ర నిధి రుణాలను 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రూ.450 కోట్లు మంజూరు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ నారాయణ సిబ్బందికి సూచించారు. ఒంగోలులోని భాగ్యనగర్‌లో వెలుగు టీటీడీసీ భవనంలో సీ్త్ర నిధి బ్యాంక్‌ మేనేజర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 57,792 మంది సభ్యులకు రూ.450 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో 22,961 మంది సభ్యులకు రూ.195.40 కోట్లను రుణాలుగా అందించినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికవరీలన్నీ డిజిటల్‌ పద్ధతిలో సీ్త్ర నిధి యాప్‌ ద్వారా చెల్లించాలని ఆదేశించారు. సీ్త్ర నిధి యాప్‌పై సభ్యులకు అవగాహన కల్పించారు. సీ్త్ర నిధి జోనల్‌ డీజీఎం ఉమామహేశ్వరరావు, ఏజీఎంలు ఉదయ్‌ కుమార్‌, చిన బుల్లయ్య సమావేశంలో పాల్గొని సభ్యులకు, డీఆర్‌డీఏ సిబ్బందికి సీ్త్ర నిధి యాప్‌పై అవగాహన కల్పించారు. సీ్త్ర నిధి కార్యకలాపాలు, విధివిధానాలు, లక్ష్యాల సాధన గురించి గ్రూపు సభ్యులకు అధికారులు సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ నీలకంఠం, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ రజనీకాంత్‌, సహాయ ప్రాజెక్టు మేనేజర్‌ జె.నారాయణ, రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌, జీవనోపాధుల విభాగం, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు, ఫార్మర్‌ మిత్రలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement