రూ.కోట్ల భూమిపై టీడీపీ కన్ను 66 ఏళ్లు.. రూ.1000 లీజు ఇరిగేషన్ స్థలానికి టెండర్ సర్వే నంబర్ 597/1బిలో 30సెంట్ల స్థలం కేటాయింపునకు రంగం సిద్ధం కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ప్రభుత్వ కార్యాలయాల పక్కన పార్టీ స్థలమా? మండిపడుతున్న ప్రజలు
అక్షరాలా రూ.12 కోట్లు విలువజేసే ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో సర్కారు పెద్దలు స్కామ్‌కు తెరతీశారు. టీడీపీ కార్యాలయానికి కారు చౌకగా కట్టబెట్టేందుకు పార్టీ పెద్దలు చకచకా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన కార్యాలయం కావడంతో అధికారులు సైతం స్వామిభక్తిని చాటుకుంటూ శరవేగంగా ఫైల్ సిద్ధం చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అరెకరా స్థలానికి ఏడాదికి రూ.1000 లీజుతో 66 ఏళ్ల కాలపరిమితితో ఇచ్చేందుకుసంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయని తెలుస్తోంది. స్థలం ఇంకా కేటాయించకపోయినా టీడీపీ నాయకులు మాత్రం కార్యాలయ నిర్మాణానికి సిద్ధమవుతుండడం కొసమెరుపు.
ప్రభుత్వ స్థలం..
పార్టీ చేసుకుందాం!


