సీఐటీయూ జిల్లా కమిటీ ఎన్నిక
దర్శి: స్థానిక తాలూకా సమావేశం హాలులో నిర్వహిస్తున్న సీఐటీయూ జిల్లా 13వ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా కాలం సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా ముప్పా రమేష్, కోశాధికారిగా పారా శ్రీనివాసరావు లతో పాటు 23 మందితో జిల్లా ఆఫీసు బెరర్స్‌తో సహా మొత్తం 61 మందితో నూతన జిల్లా కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా జి.వి కొండారెడ్డి, డి.కె.యం.రఫీ, తాండవ రంగారావు, పెంట్యాల కల్పన, బంకా సుబ్బారావు, ఈదర అన్నపూర్ణ, తంగిరాల మహేష్, టి.రాము, సీహెచ్ చీరంజీవి, కొర్రెపాటి శ్రీనివాసరావు, కార్యదర్శులుగా గంటెనపల్లి శ్రీనివాసులు, కేశవరావు, ఆవులయ్య, పల్లామల్లి ఆంజనేయులు, పందిటి రూభేన్, జి.రమేష్, ఉబ్బా ఆదిలక్ష్మి, రాయళ్ల మాలకొండయ్య, మక్కెన పరిశుద్దంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


