ఉత్సాహంగా ముగిసిన రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలు
ఒంగోలు: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీలు స్థానిక నెక్స్‌ట్ జెన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సోమవారం ముగిశాయి. అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగాలలో ఈ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని త్వరలో మధ్యప్రదేశ్ రాష్ట్రం బోఫాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికచేస్తారని, వారు మన రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల పరిశీలకుడు ఎ.రాఘవేంద్రరావు పేర్కొన్నారు. నెక్స్‌ట్‌జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏవో అమృత, స్కూల్ గేమ్స్ చెక్క వెంకటేశ్వర్లు, ఏ శిరీష కుమారి మాట్లాడుతూ అండర్ 14 , అండర్ 17 ,అండర్ 19 మూడు విభాగాల్లో బాల బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించామని, ఓపెన్ సైట్, పీప్ సైట్, పిస్టల్ అంశాలలో ఒక్కొక్క కేటగిరీ నుంచి ఆరు విభాగాలకు సంబంధించి పోటీలు నిర్వహించినట్లు వివరించారు.
పోటీల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ విజేతలు వరుసగా:
అండర్ 14 బాలురు పీప్‌సైట్: సీహెచ్ వీఎస్ లోక్జిత్–విశాఖపట్నం, పీ యశస్వి–కృష్ణా, పీ యశ్వంత్–కృష్ణా
అండర్ 14 బాలికలు ఓపెన్ సైట్: పీజేబీఎన్ ఎల్ దేవి–వెస్ట్ గోదావరి, కే నక్షత్ర–కర్నూల్, వీ గురు సాహితీ
అండర్ 14 బాలుర ఓపెన్ సైట్: వైజేవీ నరసింహ, ఎండీ టాపిక్–కడప, కే మౌర్యాదిత్య–ఈస్ట్ గోదావరి
అండర్ 14 పిస్టల్ బాలికలు: ఎన్ ఝాన్సీ–కృష్ణా, టి.కె ఆకృతి–ఈస్ట్ గోదావరి, ఆర్ అంజని– కర్నూలు
అండర్ 14 బాలికలు పీప్ సైట్: శిద్దా ఆరాధ్య–ప్రకాశం, డీ దీక్షిత–గుంటూరు, బీసీ దీపిక– కృష్ణా
అండర్ 17 బాలికలు ఓపెన్ సైట్: డి.సౌమ్య శ్రీ–వెస్ట్ గోదావరి, జీ ప్రవల్లిక–అనంతపురం, యు జగరత్–కడప
అండర్ 17 బాలికలు ఓపెన్ సైట్: ఆర్ శ్రీమన్ వెస్ట్ గోదావరి, ఎండీ ఉబైడ్–కృష్ణా, పీ వీర వినీత్– కడప
అండర్ 17 బాలురు క్రిస్టల్: జీఎస్‌ఎస్ ప్రణవ్ –ఈస్ట్ గోదావరి, పీజీ శంఖాన్–అనంతపురం, ఓఎల్‌ఎన్ కుమార్ రెడ్డి–గుంటూరు
అండర్ 17 బాలికలు పిస్టల్: వీజీ సందీశి–గుంటూరు, ఎన్ దీక్షిత– ఈస్ట్ గోదావరి, పీ మనస్విని–కడప
అండర్ 17 బాలురు పీప్ సైట్: డి.ధరణిధర్– కృష్ణా, బీఎల్‌బీపీ యశస్విన్–ఈస్ట్ గోదావరి, ఎం మురారి–కృష్ణా
అండర్ 17 బాలికలు పీప్ సైట్: పీఎస్ కార్తికేయ–గుంటూరు, ఏ ఆశ్రిత్–ఈస్ట్ గోదావరి, పీ ప్రణవి సాయి–గుంటూరు
అండర్ 19 బాలురు ఓపెన్ సైట్: ఎల్ రామోజీ గణేష్–కర్నూలు, టీ వెంకట అఖిల్–అనంతపురం, టీ రాజ్ కుమార్–అనంతపురం
అండర్ 19 బాలికలు ఓపెన్ సైట్: సీ త్రిష –అనంతపురం, జీ కళ్యాణి–ఈస్ట్ గోదావరి, డీ లక్ష్మీ ప్రసన్న–నెల్లూరు
అండర్ 19 బాలురు పిస్టల్: ఎంఎస్‌ఎస్ రామిరెడ్డి–విశాఖపట్నం, ఎస్.కె జహీర్ అలీ–విశాఖపట్నం, ఎస్ సురేంద్ర–విశాఖపట్నం
అండర్ 19 బాలికలు పిస్టల్: వై రాజరాజేశ్వరి–గుంటూరు, టీ త్రిష వర్మ–విశాఖపట్నం, సీ దీక్షిత ప్రియా– విశాఖపట్నం
అండర్ 19 బాలురు పీప్ సైట్: కే హనీష్–గుంటూరు, ఎన్‌ఎస్ ఇషాన్–కృష్ణా, బీ సాయి రవికుమార్–విశాఖపట్నం
అండర్ 19 బాలికలు పీప్ సైట్: డీ అక్షయ–కృష్ణా, ఎస్ తమన్నా–గుంటూరు, టీ చిరంజీవి–కృష్ణా


