వైభవంగా గంధ మహోత్సవం
పొదిలిరూరల్: మండలంలోని మదాలవారిపాలెంలో నాసర్ మహమ్మద్ వలి గంధ మహోత్సవం ఆదివారం గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ఉరుసు జరుపుకొని గ్రామస్తులు ఐక్యత చాటుకున్నారు. వేలాది మంది భక్తులు నాసర్ మహమ్మద్‌వలి గంధ మహోత్సవంలో పాల్గొన్నారు. దర్గాను ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో సర్వాంగా సుందరంగా అలంకరించారు. ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి ఉపవాసలతో పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకున్నారు. రాత్రి ప్రతి ఇంటి నుంచి జెండాల ఊరేగింపుతో దర్గాకు చేరుకొని నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పొదిలి నుంచి ముస్లింలు ప్రత్యేక వాహనంలో గంధం తీసుకువచ్చి దేవునికి సమర్పించారు. ఉరుసు సందర్భంగా వైఎస్సార్ సీపీ, టీడీపీల విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. ప్రభలపై నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కుల, మతాలకు అతీతంగా ఐక్యత
చాటుకున్న గ్రామస్తులు
దర్గాను దర్శించుకున్న
వేలాది మంది భక్తులు
వైభవంగా గంధ మహోత్సవం
వైభవంగా గంధ మహోత్సవం


