కోటి సంతకాలు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి | - | Sakshi
Sakshi News home page

కోటి సంతకాలు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి

Nov 10 2025 8:52 AM | Updated on Nov 10 2025 8:52 AM

కోటి సంతకాలు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి

కోటి సంతకాలు ప్రభుత్వానికి కనువిప్పు కావాలి

పార్టీలకతీతంగా పోరాడి మెడికల్‌ కాలేజీని కాపాడుకుందాం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

మార్కాపురం టౌన్‌: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వమే పూర్తిచేసి నిర్వహించాలని కోరుతూ పీపీపీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వానికి కనువిప్పు తీసుకు రావాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా 9, 18, 31 వార్డుల్లో రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొని మన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే విద్యార్థులకు వైద్య విద్యతోపాటు ప్రజలకు వైద్యాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాలేజీలను దక్కించుకున్న ప్రైవేటు వ్యక్తులు తాము పెట్టిన పెట్టుబడిన పొందేందుకు వైద్యవిద్య ఆరోగ్యాన్ని వ్యాపారం చేసి దోచుకుంటారని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, సూపర్‌ సక్సెస్‌ అని చెప్పుకోవడమే తప్ప ప్రజలకు చేకూరిన లబ్ధి ఏమీ లేదన్నారు. అదే మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పిన హామీలే కాకుండా మరెన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆర్ధికాభివృద్ధి చేకూర్చారని అన్నారు. 14 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు రాష్ట్రంలో చెప్పుకునేలా ఒక్క సంక్షేమ కార్యక్రమాన్నైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ముందుకు వచ్చి మెడికల్‌ కాలేజీని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం వార్డుల్లోని ప్రజలతో సంతకాల సేకరణ నిర్వహించారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ అబ్జర్వర్‌ కే ఆదెన్న, పార్టీ స్టేట్‌ కమిటీ సభ్యులు వెన్న హనుమారెడ్డి, అన్నా క్రిష్ణచైతన్య, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ షంషేర్‌ ఆలీబేగ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్‌ జీ శ్రీనివాసరెడ్డి, పీఎల్‌పీ యాదవ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ సలీమ్‌, కౌన్సిలర్లు డాక్టర్‌ కనకదుర్గ, సిరాజ్‌, కొత్త కృష్ణ, డాక్టర్‌ మక్బుల్‌ బాష, రిటైర్డు వార్డెన్‌ నజీర్‌, బత్తుల సుబ్బారెడ్డి, సీయం ఖాశీం, గఫూర్‌, గొలమారి సత్యనారాయణరెడ్డి, మౌలాలి, ముత్తారెడ్డి వెంకటరెడ్డి, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, న్యాయవాది భూపని కాశయ్య, నాలి కొండయ్య యాదవ్‌, బట్టగిరి తిరుపతిరెడ్డి, పోరుమామిళ్ల విజయలక్ష్మి, మల్లిక, రఫీ, జీ అంజిరెడ్డి, శివరాంపురం సర్పంచ్‌ గురుబ్రహ్మం, గౌస్‌, పత్తి రవిచంద్ర, కరీముల్లా, ఏడుకొండలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కౌన్సిలర్‌ సిరాజ్‌ ఆధ్వర్యంలో గజమాలతో అన్నా రాంబాబును సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement