జిల్లాస్థాయి ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: ఫెన్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా స్థాయి క్రీడాకారులను ఆదివారం స్థానిక మినీ స్టేడియంలో ఎంపిక చేశారు. ఎంపిక ప్రక్రియను జిల్లా కార్యదర్శి జి.నవీన్ పర్యవేక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 10,11 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ఆవరణలో జరుగుతాయన్నారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు నవీన్ తెలిపారు. ఈ క్రీడాకారుల సౌకర్యార్థం బి.భరత్, టి.క్రాంతికుమార్‌లను కోచ్‌లుగా నియమించారు. ఎంపికై న క్రీడాకారులను ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ కోటా మనోహర్ అభినందించారు.
ఎంపికై న క్రీడాకారులు వీరే:
ఈపీ బాలుర విభాగం: కమ్మ జగదీష్ చౌదరి, వాటుపల్లి లోకేష్ సాయి, పుత్తూరి అంబరీష్, అబ్దుల్ ముఖీత్ ఇర్భాజ్ మొహమ్మద్
ఈపీ బాలికల విభాగం: షేక్ అఫీఫా తబస్సుమ్, బెజవాడ నమ్రత, ముతకాని మనస్వి, షేక్ ఫిర్డౌస్ తన్వీర్
ఫాయిల్ బాలుర విభాగం: షేక్ ఆదిల్ అహ్మద్ మదీనే, మేడా రామ్‌చరణ్, తుల్లిబల్లి అక్షయ్ శ్రీనాథ్, తుల్లిబల్లి క్రాంతికుమార్
ఫాయిల్ బాలికల విభాగం: కోడెల తనూజ, కూరపాటి బాలనాగ స్నేహంజలి, ఎద్దు భూమి నర్తన, చుండూరి వర్షిణి
సాబ్రే బాలుర విభాగం: కోడూరి వెంకట సాయి తేజరెడ్డి, కోడూరి మోహన్ సాయినాథ్‌రెడ్డి, తుల్లిబల్లి అభినవ్ బుద్ద, గడికొయ్యల శ్రీకాంత్
సాబ్రే బాలికల విభాగం: పుత్తూరి చక్రిక, ఏకాంబరం వెంకట సాయి మహిత, మందిగ నందితాదేవి
జిల్లాస్థాయి ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక


