మెడికలేనా.. | - | Sakshi
Sakshi News home page

మెడికలేనా..

Aug 4 2025 5:32 AM | Updated on Aug 4 2025 5:32 AM

మెడిక

మెడికలేనా..

నిలిచిపోయిన మెడికల్‌ కళాశాల

మార్కాపురం: కూటమి ప్రభుత్వం నూతన మెడికల్‌ కాలేజీలపై కక్ష కట్టింది. మొదట్లో పీపీపీ విధానంలో నిర్మిస్తామంటూ చెప్పి నిర్మాణాలు మాత్రం నిలిపేసింది. దీంతో మార్కాపురంలో నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. కాలేజీ నిర్మాణ పనులు యధావిధిగా జరిగి ఉంటే ఈ ఏడాదైనా ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమై ఉండేవి. కానీ అలా జరగలేదు. దీంతో ఈ ఏడాది మెడికల్‌ కౌన్సెలింగ్‌లో మార్కాపురం మెడికల్‌ కాలేజీని చేర్చలేదు. నిర్మాణం పూర్తయి ఉంటే నీట్‌ రాసిన విద్యార్థులు మార్కాపురం మెడికల్‌ కాలేజీలో ఆప్షన్‌ ఎంచుకునేవారు ఎంబీబీఎస్‌లో చేరేందుకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల నమోదు ఇప్పటికే ప్రారంభమైంది. అందులో మార్కాపురం మెడికల్‌ కాలేజీ లేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పశ్చిమ ప్రకాశం నుంచి నీట్‌ పరీక్షను సుమారు 5 వేల మంది రాశారు. పలువురు అర్హత సాధించారు. అయితే వారందరూ మార్కాపురం మెడికల్‌ కళాశాల పూర్తికాకపోవడంతో రాష్ట్రంలోని వివిధ మెడికల్‌ కళాశాలలను ఆప్షన్లుగా ఎంచుకున్నారు.

గత ప్రభుత్వంలో 75 శాతం పూర్తయిన పనులు:

పశ్చిమ ప్రకాశంలోని సుమారు 8 లక్షల మంది ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్కాపురానికి సుమారు రూ.475 కోట్లతో మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారు. 150 ఎంబీబీఎస్‌ సీట్లను దృష్టిలో ఉంచుకొని జీజీహెచ్‌ వైద్యశాల అభివృద్ధి పనులను, మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద 41.97 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు గత ఏడాది సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ రిజల్ట్‌ వచ్చే వరకూ జరిగాయి. పనులు కూడా గత రెండేళ్లలో వేగంగా జరగడంతో దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. సిబ్బంది క్వార్టర్లు, నర్సింగ్‌ కళాశాల, జంట్స్‌, లేడీస్‌ హాస్టల్స్‌, క్లాసు రూములు, సెంట్రల్‌ క్యాంటిన్‌ పూర్తయ్యాయి. ప్రస్తుతం కళాశాలలో విద్యుత్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌ పనులు, రంగులతోపాటు కొన్ని భవనాల నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంది. జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చడంతోపాటు 450 బెడ్లు ఏర్పాటుచేసి, 82 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, డాక్టర్లు అందుబాటులో ఉంచారు. దీంతో రోజుకు సుమారు 750 నుంచి 800 మంది పేషంట్లు వైద్యసేవలు పొందేవారు. 3 ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఐసీయూ యూనిట్‌, వెంటిలేటర్‌ సౌకర్యాలను కూడా కల్పించారు. గత ఏడాది జూన్‌ 24న నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ఆఫ్‌ ఇండియా బృందం మెడికల్‌ కాలేజీని, జీజీహెచ్‌ను సందర్శించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఆ నివేదిక ఏమైందో తెలీదు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అసంపూర్తి భవనాలంటూ నిలిపేయడంతో పాటు జీజీహెచ్‌లో ఉన్న సుమారు 40 మంది మెడికల్‌ కళాశాలకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది.

అయితే ఏడాది నుంచి ఈ పనులు కూడా జరగలేదు. కళాశాల నిర్మాణం పూర్తయి ఉంటే జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన 450 బెడ్లు ఉపయోగపడి ఉండేవి. వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్‌ కోసం అనేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జనరల్‌ మెడిసిన్‌ కోసం 100, ఆప్తమాలజీ 20, డెర్మటాలజీ 10, సైకియాట్రీ విభాగం 10, జనరల్‌ సర్జరీల కోసం 100, ఆర్థోపెడిక్‌ విభాగానికి 40, ఈఎన్‌టీకి 20, ఐసీయూ బెడ్లు 20, పీడియాట్రిక్స్‌ 50, ఓబీజీ (ప్రసూతి గైనకాలజీకి) 50 బెడ్లను కేటాయించారు. వీటిలో ప్రస్తుతం కొన్ని బెడ్లు మాత్రమే రోగుల కోసం ఉపయోగిస్తున్నారు.

ఏడాదిగా నిలిచిన మార్కాపురం మెడికల్‌ కళాశాల నిర్మాణం ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో మార్కాపురం కాలేజీని చేర్చని ప్రభుత్వం ఈ ఏడాది కూడా అడ్మిషన్లు లేనట్టే మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

మెడికల్‌ కాలేజీ త్వరగా పూర్తిచేయాలి

మార్కాపురం మండలం రాయవరం దగ్గర నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీని ప్రభుత్వం త్వరగా పూర్తిచేయాలి. దీని వలన 100 మెడికల్‌ సీట్లు మంజూరైతే ఈ ప్రాంత విద్యార్థులకు ఎంబీబీఎస్‌ విద్య అందుబాటులోకి వస్తుంది. దీనితోపాటు జీజీహెచ్‌లో కూడా రోగులకు మెరుగైన సేవలు లభిస్తాయి. ప్రభుత్వమే మెడికల్‌ కాలేజీని నిర్వహించాలి. పీపీపీ విధానం వద్దు.

– డీఎంకే రఫీ, సీపీఎం నాయకులు

మెడికలేనా..1
1/2

మెడికలేనా..

మెడికలేనా..2
2/2

మెడికలేనా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement