రాష్ట్ర స్థాయి పోటీలకు చీమకుర్తి క్రీడాకారిణిలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు చీమకుర్తి క్రీడాకారిణిలు

Aug 4 2025 5:06 AM | Updated on Aug 4 2025 5:06 AM

రాష్ట్ర స్థాయి పోటీలకు చీమకుర్తి క్రీడాకారిణిలు

రాష్ట్ర స్థాయి పోటీలకు చీమకుర్తి క్రీడాకారిణిలు

చీమకుర్తి: చీమకుర్తిలోని జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూలుకు చెందిన క్రీడాకారిణిలు రాష్ట్ర స్థాయి బాల్‌ బాడ్మింటన్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఆదివారం కావలి సమీపంలోని చేవూరులో జరిగిన అంతర జిల్లా స్థాయి బాలికల పోటీల్లో చీమకుర్తి నుంచి ఎంపికై న వారి వివరాలను పీడీ డీ.స్వరూపావాణి చీమకుర్తిలోని మీడియాకు తెలిపారు. జూనియర్‌ బాడ్మింటన్‌ పోటీలకు దీక్ష, సబ్‌ జూనియర్‌ పోటీలకు కృప, మేఘన, అక్షయ ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో జూనియర్స్‌కు అనంతపురంలోను, సబ్‌జూనియర్స్‌కు చేవూరులో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తారని పీడీ తెలిపారు. ఎంపికై న క్రీడాకారిణిలను చీమకుర్తి జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూలు టీచర్స్‌, వారి తల్లిదండ్రులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement