
ఈ వాచ్‌మన్ వద్దండి
దర్శి: పట్టణంలోని లంకోజనపల్లి రోడ్డులో ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో వాచ్ ఉమన్ బదులు ఆమె భర్త విధులు నిర్వహించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాచ్‌మెన్‌గా పురుషుడు వద్దంటూ ఏఎస్‌డబ్ల్యూఓకు ఆదివారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. బాలికల హాస్టల్లో వాచ్ ఉమన్ డ్యూటీ చేయాల్సిన స్వప్న తన భర్తను విధులకు ఎలా పంపుతోందని, ఆడపిల్లల హాస్టల్లోకి మగవారిని ఎలా అనుమతించారని ఏఎస్‌డబ్ల్యూఓను ప్రశ్నించారు. దీనిపై ఏఎస్‌డబ్ల్యూఓ స్పందిస్తూ.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాచ్ ఉమన్ స్వప్నను బదిలీ చేస్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించి వెనుదిరిగారు. కాగా వాచ్‌మన్‌కు వార్డెన్‌కు మధ్య విభేదాల వల్ల హాస్టల్లో నిత్యం వివాదం చోటుచేసుకుంటున్నట్లు సమాచారం.
● దర్శి ఎస్సీ బాలికల హాస్టల్ వద్ద తల్లిదండ్రుల నిరసన
● వాచ్ ఉమన్ బదులు భర్త విధుల్లో ఉండటంపై ఆగ్రహం