తర్లుపాడు: డీలర్లు రేషన్ బియ్యం ఇవ్వకుండా వాటికి బదులుగా కార్డుదారులకు డబ్బులు ఇస్తుండటంపై ఆదివారం సాక్షి మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన ‘‘బియ్యం లేవ్.. డబ్బులు తీస్కో..’’ కథనంపై ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ డేవిడ్‌రాజు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ముకుంద హరి స్పందించారు. మండలంలోని కేతగుడిపి, సూరేపల్లి రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. డీలర్ల సమక్షంలో స్టాక్‌ను పరిశీలించారు. రెండు చోట్ల ఎక్కువ మొత్తంలో బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కేతగుడిపిలో వీఆర్వో కాశీశ్వర్‌రెడ్డికి స్టాక్ అప్పగించారు. సూరేపల్లిలో డీలర్ పొంతన లేని సమాధానం ఇచ్చారు. దీంతో ఇద్దరు డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ 1100
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్–1100ను ప్రవేశపెట్టిందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ ద్వారా ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో ఆన్‌లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోనవచ్చన్నారు. అర్జీదారులు 1100 నంబర్‌కు డయల్ చేసి, తమ సమస్యను విన్నవిస్తే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు రిజిస్టర్ చేసుకుంటుందని వివరించారు. ఆ సమస్యను సంబంధిత అధికారికి పంపి తద్వారా పరిష్కరించేందుకు వీలుకలుగుతుందన్నారు. సమస్యను కాల్ సెంటర్‌లో నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా నిర్ధారణ సందేశం పంపుతారని వివరించారు.
ఆ డీలర్లపై 6ఏ కేసులు