
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కూల్ డ్రింక్ షాపు దగ్
● రూ.2 లక్షల మేర నష్టం
పుల్లలచెరువు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి కూల్ డ్రింక్ దుకాణం దగ్ధమైన సంఘటన మండలంలోని నర్వ తండాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కొమరోలుకు సమీపంలో హైవేపై నర్వ తండాకు చెందిన బి.తేజానాయక్ కూల్ డ్రింక్స్, రిటైల్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో షాపులోని సుమారు రూ.50 వేల విలువైన ఫ్రిజ్‌లు, రిటైల్ సరుకులు, రూ.లక్ష నగదు, మూడు ప్రామిసరీ నోట్లు, రూ.30 వేల విలువైన టీవీ, రూ.15 వేల విలువైన ఫోన్లు పూర్తిగా కాలిపోయాయి. అధికారులు పరిశీలించి తగిన పరిహారం అందజేయాలని బాధితుడు వేడుకొంటున్నాడు.