
ప్రజలను మోసం చేయడంలో బాబు దిట్ట
● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: ప్రజలను నమ్మించి మోసం చేయడంలో సీఎం చంద్రబాబు దిట్టని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని శానంపూడిలో బుధవారం రాత్రి పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ, పార్టీ గ్రామ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఒక్క హామీ సక్రమంగా అమలు చేయటం లేదని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి, మహాశక్తి, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయలేదన్నారు. తల్లికి వందనం కూడా అరకొరగా ఇచ్చారని, అదేమంటే కేంద్రం ఈ పథకానికి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని చెబుతున్నారని ధ్వజమెత్తారు. పథకాలు అమలు చేయమంటే అన్ని అమలు చేశామని చెబుతున్నారని, లేకపోతే మీ నాలుక మందం అని అంటున్నారని, నాలుక మందమో, మీ తోలు మందమో ప్రజలే తేలుస్తారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిగత హక్కులతో సమావేశం ఏర్పాటు చేస్తే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని, ఇది అంబేడ్కర్ రాజ్యాంగమా లేక రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా..అని సురేష్ ప్రశ్నించారు. కూటమి అరాచకాలు రాసేందుకు ఎన్ని పుస్తకాలైనా సరిపోవని, కంప్యూటర్ ఒక్కటే సరిపోతుందన్నారు.
లేని శాఖకు మంత్రి స్వామి
వలంటీర్ వ్యవస్థను రద్దు చేసినా నేటికీ స్వామి ఆ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వలంటీర్లు ప్రజలకు సంక్షేమ పథకాలను ఇంటికి తెచ్చి ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచుతానని చెప్పి ఇప్పుడు ఆ వ్యవస్థనే రద్దు చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, బియ్యం మాఽఫియా యథేచ్ఛగా సాగుతోందని, బియ్యం నుంచి ప్రతినెలా మంత్రి స్వామికి రూ.25 లక్షల ముడుపులు ముడుతున్నాయని ఆరోపించారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ బ్రహ్మయ్య, మాదాల శంకర్, ఆర్.అంకయ్య, బి.బుజ్జి, ఏ.దత్తు, ఎం.వేణు, బి.మురళి, ఎన్.బాలయ్య, బి.ప్రభాకర్, కె.పోలిరాజు, కె.భాస్కర్, వి.శ్రీహరి, ఆర్.వెంకటప్రసాద్, ఎస్.వీరయ్య, ఎన్.బాలకోటయ్య, షేక్ సుల్తాన్, కూనం నరేంద్రరెడ్డి, సుదర్శి వెంకట్రావు, యనమల మాధవి, రాపూరి ప్రభావతి, పఠాన్ రియాజ్, షేక్ మహమ్మద్ బాషా, షేక్ సలీం, గాదంశెట్టి గుప్తా, సోమిశెట్టి సురేష్, చుక్కా కిరణ్‌కుమార్, మిడసల అశోక్, గొల్లపోతు గోవర్ధన్, కోమిట్ల వెంకారెడ్డి, షేక్ అల్లాభక్షు, షేక్ కరీం, బుజ్జమ్మ, షేక్ నౌషాద్, గోళ్లమూడి అశోక్‌రెడ్డి, బల్లెల ప్రభాకరరెడ్డి, కేశవరపు కృష్ణారెడ్డి, పౌల్, తాతయ్య, విజయ్, నరేష్, పున్నయ్య, సాయికోటి, పి.శ్రీనివాసులరెడ్డి, చొప్పర శివ, పాకనాటి రమణారెడ్డి, పాకనాటి సుబ్బారెడ్డి, హనుమంతరావు పాల్గొన్నారు.