
జేసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
ఒంగోలు సబర్బన్:
జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని సంస్థలు, గోడౌన్లు, పెట్రోలు బంకులు, గ్యాస్ గోడౌన్లతో పాటు ఇతర సంస్థల్లో బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్‌డీఓలు, తహసీల్దార్లతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు, పౌరసరఫరాల అధికారి, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, ఫుడ్ ిసేప్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఫైర్ డిపార్ట్‌మెంట్, రూరల్ వాటర్ సప్లయ్ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి అధికారిలందరూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, రేషన్ షాపులు, ఎంఎల్‌ఎస్ పాయింట్స్, రైస్ మిల్లులు, బాణసంచా గోడౌన్లు, వాటర్ ఆర్‌ఓ ప్లాంట్లు, సినిమా హాళ్లు కూడా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు పెట్రోలు బంకులు–38, గ్యాస్ ఏజెన్సీలు–9, రేషన్ షాపులు–50, ఎంఎల్‌ఎస్ పాయింట్స్–9, రైస్ మిల్లులు–6, బాణసంచా గోడౌన్లు–3, ఆర్‌ఓ ప్లాంట్లు–22, ఆర్‌టీసీ బస్టాండ్స్–2, హోటల్స్–2, ఐస్ క్రీమ్–1, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్–1, సినిమా హాళ్లు–5 పరిశీలించారు. తనిఖీలు నిర్వహించిన వారిలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్.పద్మశ్రీ, రెవెన్యూ డివిజనల్ అధికార్లు, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్, జిల్లాలోని అందరూ తహసీల్దార్లు, సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, ఫుడ్ పేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రోలజీ అధికారులతో పాటు అన్ని విభాగాల అధికారులు ఉన్నారు.