ఐఐటీ ముంబైలో చేరతానంటున్న సూరజ్‌.. | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ ముంబైలో చేరతానంటున్న సూరజ్‌..

Published Wed, Jun 12 2024 1:08 AM | Last Updated on Wed, Jun 12 2024 1:26 AM

ఐఐటీ ముంబైలో చేరతానంటున్న సూరజ్‌..

ఎంసెట్‌లో రాష్ట్రస్థాయి 15వ ర్యాంకు సాధించిన షేక్‌ సూరజ్‌ ఒంగోలు భాగ్యనగర్‌ నివాసి. ఇతని తండ్రి దరియాసాహెబ్‌ ప్రస్తుతం రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. సూరజ్‌ ఇంటర్‌ నెల్లూరులోని బ్రహ్మదేవి ఐఐటీ క్యాంపస్‌లో చదివాడు. జేఈఈ మెయిన్స్‌లో 300/300 మార్కులతో జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల్లో ఓపెన్‌ కేటగిరీలో 134వ ర్యాంకును, ఓబీసీ కేటగిరీలో 11వ ర్యాంకు దక్కించుకున్నాడు. తాజాగా ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకును, జిల్లాస్థాయిలో 2వ ర్యాంకును కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకు జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాల ప్రకారం ఐఐటీ ముంబైలో సీటు వస్తుందని, సీఎస్‌ఈ గ్రూపు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా సూరజ్‌ను తల్లిదండ్రులతోపాటు బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement