‘రాయలసీమ మీద చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?’ | YSRCP Sailaja Nath Takes On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘రాయలసీమ మీద చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?’

Mar 23 2026 5:10 PM | Updated on Mar 23 2026 5:20 PM

YSRCP Sailaja Nath Takes On Chandrababu Naidu

తాడేపల్లి :  రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ఆపేయడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి శైలజానాధ్‌. రాయలసీమ మీద చంద్రబాబుకు ఎందకంత ద్వేషం అని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 23వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్‌.. ‘ వైఎస్‌ జగన్‌ రూ. 900 కోట్లతో 90 శాతం ఆల్రెడీ పనులు పూర్తి చేశారు. మిగతా పనులు చేయకుండా చంద్రబాబు అన్యాయం చేశారు. తెలంగాణాకు మేలు చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆల్మట్టి నిర్మాణంతో ఇప్పటికే ఏపీకి, రాయలసీమకు అన్యాయం జరిగింది. 

ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. పోలవరంలో వంద టీఎంసీల కంటే తక్కువ నీటిని నిల్వ చేస్తున్నారు. రాష్ట్రమంతటా నీటి కొరత ఏర్పడుబోతోంది. రాయలసీమకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. ఏయిమ్స్, గ్రామీణ బ్యాంకు, హైకోర్టు, స్టీల్ ప్లాంట్ వంటివన్నిటినీ చంద్రబాబు తరలించుకుపోయారు. రాయలసీమ మీద చంద్రబాబుకు ప్రేమ లేదనటానికి ఇదే నిదర్శనం. 

అసలు చంద్రబాబు రాయలసీమకు ఏం న్యాయం చేశారో చెప్పాలి?, వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు రైతులన్నా ప్రాజెక్టులన్నా ఎందుకంత ద్వేషం?, పొరుగు రాష్ట్ర సీఎం వద్దన్నారని రాయలసీమ లిఫ్టును ఆపటం ఏంటి?, తెలంగాణ, కర్నాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలి’ అని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement