కోలాహలంగా వైఎస్సార్‌సీపీ ప్లీనరీలు

YSRCP Plenary 2022 Celebrations In Andhra Pradesh - Sakshi

కర్నూలు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో ఘనంగా నిర్వహణ

175 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని నేతల పిలుపు

కర్నూలు (సెంట్రల్‌)/సాక్షి, పాడేరు/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/సాక్షి, భీమవరం/సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, గుంటూరు: జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సందర్భంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ ప్లీనరీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కర్నూలు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ ప్లీనరీలు ఘనంగా జరిగాయి. కర్నూలులో జరిగిన జిల్లా ప్లీనరీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు ఏడాదికి 19 శాతం పెరిగితే.. తమ ప్రభుత్వంలో 15 శాతానికి తగ్గించామన్నారు.

పాడేరులో జరిగిన అల్లూరి సీతారామరాజు జిల్లా పార్టీ ప్లీనరీలో పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ ప్లీనరీలో ఎంపీ గొడ్డేటి మాధవి, ప్లీనరీ పరిశీలకులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, ఎమ్మెల్యే లు చెట్టి ఫల్గుణ, ధనలక్ష్మి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, రాష్ట్ర ట్రైకార్‌ చైర్మన్‌ బుల్లిబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ïప్లీనరీ ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు హయాం లో సకల అరాచకాలు, దాష్టీకాలు, ముఠాపాలన, నిరంకుశత్వం కొనసాగాయన్నారు. ఈ సమావేశం లో మంత్రి జోగి రమేష్, విప్‌ సామినేని ఉదయభాను, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, రక్షణ ని«ధి, మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీలు  కల్పలత, డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ప్లీనరీని భీమవరంలో నిర్వహించారు. 

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. 175 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎమ్మెల్సీ çరవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయనగరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస రావు అధ్యక్షతన జిల్లాస్థాయి ప్లీనరీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు రాజన్నదొర, బొత్స సత్యనారాయణ, ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు వీరభద్రస్వామి, చినవెంకట అప్పలనాయుడు, అప్పలనర్సయ్య, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, బడుకొండ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటలో నిర్వహించిన పల్నాడు జిల్లా స్థాయి ప్లీనరీ పార్టీ కోఆర్డినేటర్‌ కొడాలి నాని, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, విడదల రజని, పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, నంబూరి శంకరరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, జిల్లా ప్లీనరీ పరిశీలకుడు బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top