‘అర్ధరాత్రి గౌతమ్‌రెడ్డి ఇంటి కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్‌పురం దొంగలు కాదు.. పోలీసులు’ | YSRCP Leaders Lambast TDP Govt Over Illegal Police Case Of Punuru Gowtham Reddy | Sakshi
Sakshi News home page

‘అర్ధరాత్రి గౌతమ్‌రెడ్డి ఇంటి కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్‌పురం దొంగలు కాదు.. పోలీసులు’

Nov 15 2024 5:46 PM | Updated on Nov 15 2024 6:19 PM

YSRCP Leaders Lambast TDP Govt Over Illegal Police Case Of Punuru Gowtham Reddy

విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కనీస నిబంధనల్ని కూడా పోలీసులు పాటించలేదని, మెయిన్‌డోర్‌ వేసుంటే వెనుక వైపు ఉన్న కిటికీని పగలగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారన్నారు.  అలా ప్రవేశించింది ఏ స్టూవర్ట్‌పురం దొంగలో కాదని, ఏకంగా పోలీసులే అటువంటి దుస్సాహానికి పాల్పడ్డారని అంబటి విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీకి చెందని  నేతలు అ​ంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, చంద్రశేఖర్‌, లేళ్ల అప్పిరెడ్డి, భాగలక్ష్మీ, శైలజారెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి.. కూటమి సర్కారు అప్రజాస్వామిక చర్యలపై ధ్వజమెత్తారు.

‘12వ తేదీ అర్ధరాత్రి పూనురు గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు దుర్మార్గం. కనీస నిబంధనలను కూడా పోలీసులు పాటించలేదు. మెయిన్ డోర్ వేసుంటే వెనుక వైపు ఉన్న కిటికీని పగలగొట్టారు. కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్ పురం దొంగలు కాదు.. పోలీసులు. ఆ సమయంలో గౌతమ్ రెడ్డి భార్య తప్ప మరొకరు లేరు. పూనూరు గౌతమ్ రెడ్డి వైసీపీలో సీనియర్ నేత. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్ధిగా పోటీచేయించాలని భావించాం.  

గౌతమ్‌రెడ్డి ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ చూశాక మాకు ఆశ్చర్యమేసింది. పోలీసులు ఇలా కూడా వ్యవహరిస్తారా అనిపించింది.  గండూరి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గౌతమ్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఒక సివిల్ కేసును పోలీసులు అక్రమ కేసుగా మార్చారు. గౌతమ్ రెడ్డి పై పెట్టిన కేసు పూర్తిగా తప్పుడు కేసు. మహిళలు మాత్రమే ఉన్న సమయంలో అక్రమంగా పోలీసులు ఇంట్లోకి ప్రవేశిస్తే ఎవరికైనా భయం కలగదా. గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంతకంటో వేరే మార్గమే లేదా?విజయవాడ పోలీస్ కమిషనర్ ,డిజిపిలను ప్రశ్నిస్తున్నా. 

గౌతమ్ రెడ్డిని పరామర్శించిన అంబటి, మేరుగు, చంద్రశేఖర్ తదితరులు

మీ ఆదేశాలు లేకుండానే పోలీసులు ఇలా చేస్తారా?నేరం మోపబడిన వ్యక్తి ఇంట్లో ఇలా ప్రవేశించడం కరెక్టేనా అని హోంమంత్రి అనితను అడుగుతున్నా. ఏపీలో అరాచకం జరుగుతుందని మేం మొదట్నుంచి చెబుతున్నాం. గౌతమ్ రెడ్డిని పట్టుకోవడానికి ఇంతకంటే మరోమార్గం మీకు దొరకలేదా?, మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఇలా చేయొచ్చా హోంమంత్రి సమాధానం చెప్పాలి. ఈ ఘటనను మేం తేలిగ్గా విడిచిపెట్టం...న్యాయపరంగా పోరాడుతాం. న్యాయసలహా తీసుకుని పోలీసుల పై ప్రవేట్ కేసు పెడతాం. పోలీసుల పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి’ అని అంబటి నిలదీశారు. 

ప్రశ్నించే వారిని కూటమి ప్రభుత్వం బెదిరిస్తోంది:  ఎమ్మెల్యే చంద్రశేఖర్‌

పోలీసులే అర్థరాత్రి దొంగల్లా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నారని, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. గౌతమ్‌రెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే పోలీసులే ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా డీజీపీ? అని ప్రశ్నించారు. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమని, అర్థరాత్రి మహిళలున్న సమయంలో ఇళ్లల్లోకి పోలీసులు ప్రవేశించడం కరెక్టేనా? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం నిర్బంధకాండను ప్రజలు తెలుసుకోవాలని, అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం చేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement