
సాక్షి, అమరావతి : పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సీఎం జగన్ పాలనను కాపీ కొట్టి మేనిఫెస్టో పేరుతో విడుదల చేశాడు కోతల నాయుడు. తన 14 ఏళ్ల పాలనలో పల్లెలకు ఏమీ చేయలేదని ఇప్పుడు లెంపలేసుకుంటున్నాడు. వాక్సినేషన్‌ను అడ్డుకునేందుకు కుట్ర పన్ని పంచాయితీల్లో గెలిపిస్తే అందరికీ కరోనా వాక్సిన్ వేయిస్తాడట!’ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.
చదవండి: ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలి
మరో ట్వీట్‌లో ‘అమ్మకు అన్నం పెట్టనోడు - చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట! అధికారంలో ఉన్నప్పుడు గజం స్థలానికి టికానా లేదు. ఆ మదనపల్లి దంపతుల్లాగే సత్యలోకంలో ఉన్నాడు ఈ చంద్రగిరి నాయుడు. తన పిచ్చిని ఎల్లో కుల మీడియాకు పూర్తిగా ఎక్కించేశాడు’ అని ట్వీట్ చేశారు.
జగన్ గారి పాలనను కాపీ కొట్టి మేనిఫెస్టో పేరుతో విడుదల చేశాడు కోతల నాయుడు. తన 14 ఏళ్ల పాలనలో పల్లెలకు ఏమీ చేయలేదని ఇప్పుడు లెంపలేసుకుంటున్నాడు. వాక్సినేషన్‌ను అడ్డుకునేందుకు కుట్ర పన్ని పంచాయితీల్లో గెలిపిస్తే అందరికీ కరోనా వాక్సిన్ వేయిస్తాడట!
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 30, 2021