
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'మేం ఓడితే పెట్టుబడులు రావు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతాయని శాపనార్థాలు పెట్టిన చంద్రబాబు, ఆయన భజన బృందం నోరు విప్పడానికి సిగ్గుపడుతున్నారు. సీఎం జగన్ గారి చొరవతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. గతంలోలాగా ఎవరికీ కమిషన్లు, వాటాలు ఇవ్వనవసరం లేదు' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: (అబ్బెబ్బే... ప్యాకేజి మాటే ఎత్తలేదు)