వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోనే వికేంద్రీకరణ  | Vellampalli Srinivas Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోనే వికేంద్రీకరణ 

Aug 5 2020 4:51 AM | Updated on Aug 5 2020 4:51 AM

Vellampalli Srinivas Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతి అంశంలోనూ తప్పుడు ఆరోపణలు చేసే మూర్ఖులు చంద్రబాబు పార్టీ నేతలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ‘వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే వైఎస్సార్‌సీపీ స్పష్టంగా చెప్పింది. మేనిఫెస్టోను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని నోటికి తాళాలు వేసుకుంటే మంచిది’ అని మంత్రి హితవు పలికారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం మీడియాకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. 

► డెడ్‌లైన్‌ పెట్టడానికి చంద్రబాబు స్థాయి ఏంటి? ఆయనకు సవాల్‌ విసిరే అర్హత లేదు. ఆయనకి ధైర్యం ఉంటే తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. 
► అమరావతి శాసన రాజధాని. దానితో పాటు మరో రెండు రాజధానులు తెస్తే తప్పేముంది?  n సీఆర్డీఏ చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ అథారిటీ. ఆయన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని మేము రన్‌ చేయాలా?   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement