త‌ల‌మాసినోళ్లను చేర్చుకుంటున్నారు: కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

Union Minister Kishan Reddy Comments On Kcr Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సహకారం అందడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.

‘‘రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేంద్రం ఏం చేస్తుందనే విమర్శించడం తప్ప, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదు. కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు’’ అంటూ కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

‘‘రాష్ట్రాన్ని సలహాదారులకు అప్పగించారు. మహారాష్ట్రలో తలమాసినోళ్లను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఫ్లెక్సీ ల్లో వేసుకుంటే దేశ్ కి నేత కాలేరు. కేసీఆర్ ఎకరాకు పదివేలు మాత్రమే ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఎకరాకు కేవలం ఎరువుల సబ్సిడీతోనే 18 వేల 254 రూపాయలు ఇస్తుంది. కేసీఆర్ ఎరువులు ఉచితంగా ఇస్తానని చెప్పారు.. ఏమైంది?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

‘‘రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎరువుల ధరలు పెరిగినా రైతులపై అదనపు భారం వేయడం లేదు. ప్రతీ బస్తా మీద ధరలు ముద్రిస్తున్నాం. రైతులకు ఇచ్చిన మాట కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోవడం లేదు. గురువింద గింజ సామెతలా ఉంది కేసీఆర్ తీరు. ఉట్టికి ఎగరలేని వారు ఆకాశానికి ఎగిరినట్లు ఉంది కేసీఆర్ వైఖరి. డిజిటల్ ట్రాన్సక్షన్‌లో భారత్‌ నంబర్‌వన్‌గా నిలిచింది’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
చదవండి: ‘మోసం చేసింది.. నా లవర్‌ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top