తృణమూల్‌పై నడ్డా విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం మమత | Trinamool Has No Principles Party Only Has Syndicates Nadda Hits Out at Mamata | Sakshi
Sakshi News home page

తృణమూల్‌పై నడ్డా విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం మమత

Jun 9 2022 11:15 AM | Updated on Jun 9 2022 11:25 AM

Trinamool Has No Principles Party Only Has Syndicates Nadda Hits Out at Mamata - Sakshi

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి విధానాలు, విలువలు లేవంటూ బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యవస్థీకృత వసూళ్లకు పాల్పడే సిండికేట్లు నడపడమే దానికి తెలిసిన ఏకైక విద్య అని ఎద్దేవా చేశారు. బెంగాల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ చేతిలో తృణమూల్‌ ఓటమి ఖాయమన్నారు. రెండు రోజుల బెంగాల్‌ పర్యటనలో ఉన్న ఆయన బంకించంద్ర చటర్జీ వందేమాతరాన్ని రచించిన వందేమాతరం భవన్‌ను బుధవారం సందర్శించారు.

మరోవైపు నడ్డా విమర్శలపై బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెట్టేందుకు పథకాలు, ప్రత్యేక రాష్ట్రాల హామీలివ్వడం, తర్వాత తుంగలో తొక్కడం బీజేపీకి పరిపాటేనన్నారు. 
చదవండి: వివాదస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరింత చిక్కుల్లో నూపుర్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement