క్లైమాక్స్‌కు చేరిన టీపీసీసీ ఎంపిక కసరత్తు

TPCC President Selection Exercised Reaching Climax - Sakshi

సాక్షి, ఢిల్లీ: టీపీసీసీ ఎంపిక కసరత్తు క్లైమాక్స్‌కు చేరింది. నాయకుల అభిప్రాయాలను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాకూర్‌ సేకరించారు. సీనియర్లకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కీలక నేతలు అంటున్నారు. కేసీఆర్ సర్కార్ పై దూకుడుగా పోరాడే నాయకులకి పగ్గాలు ఇవ్వాలని మరో వర్గం నాయకులు అంటున్నారు. అని వర్గాల అభిప్రాయాలను ఠాకూర్‌.. సోనియా ముందు ఉంచారు. టీపీసీసీ రేసులో ముందంజలో కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ ఉన్నారు. వీలైనంత త్వరలోనే పీసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన వెలువడే అవకాశముంది

కాగా, కాంగ్రెస్‌ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష వ్యవహారం వ్యవహారం నలుగుతూ వస్తుంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలకు తోడు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఒకరి వెనుక ఒకరు ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో టీపీసీసీ అంశం మరోమారు చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈ పదవిని ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి హస్తిన బాట పట్టిన సంగతి విదితమే. మరో వైపు టీపీసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఎటువంటి ఆసక్తి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: Huzurabad: ‘సాగర్‌’ ఫార్మూలాతో ఈటలకు చెక్‌.. బాస్‌ ప్లాన్‌ ఇదేనా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top