బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం.. | Sakshi
Sakshi News home page

బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం

Published Mon, Mar 29 2021 3:34 PM

Tirupati By Election; Ambiguous In BJP And Janasena Alliance - Sakshi

సాక్షి, నెల్లూరు: బీజేపీ-జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం నెలకొంది. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ ప్రక్రియలో జనసేన నేతలు కనిపించలేదు. కేవలం బీజేపీ నేతలు, కార్యకర్తలతోనే  రత్నప్రభ నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియలో జనసేన నేతలు లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. బీజేపీ, జనసేన మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ ముందు నుంచే హడావుడి చేసినా.. ప్రస్తుత పరిణామాలతో అనేక అనుమానాలు తలెత్తున్నాయి.

నామినేషన్ వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి‌
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్‌లో నామినేషన్ వేశారు. ముందుగా ఆయన నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకొని దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీఆర్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గురుమూర్తి నివాళులు అర్పించారు. తర్వాత వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ర్యాలీగా గురుమూర్తి కలెక్టరేట్‌కు చేరుకొని మూడు సెట్ల​ నామినేషన్‌ దాఖలు చేశారు.
చదవండి:
తిరుపతి ఉప ఎన్నిక: ‘ఫ్యాను’దే హవా
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన కటిఫ్‌?

Advertisement
Advertisement