TS: బీజేపీ బిగ్‌ ప్లాన్‌.. పార్టీలో చేరుతున్న ముగ్గురికి టికెట్స్‌!  | Telangana BJP Took Key Decision Over Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

TS: బీజేపీ బిగ్‌ ప్లాన్‌.. పార్టీలో చేరుతున్న ముగ్గురికి టికెట్స్‌! 

Mar 10 2024 11:44 AM | Updated on Mar 10 2024 12:19 PM

Telangana BJP Key Decision Taken Over Lok Sabha Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ చేరుతున్న నేతలకు టికెట్‌ ఇచ్చే ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. నేడు ముగ్గురు సీనియర్‌ నేతలు బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం. 

అయితే, రేపు(సోమవారం) బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ క్రమంలో రెండో జాబితాలను అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎనిమిది మంది అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అధిష్టానాకికి జాబితాను పంపించారు. ఇక, నిన్న(శనివారం)రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కిషన్‌రెడ్డి భేటీ కూడా అయ్యారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చర్చలు జరిపారు. 

కాగా, తెలంగాణలో పార్టీలో చేరికపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో సీతారాంరాయక్‌, నగేష్‌, జలగం వెంకట్రావ్‌ను బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్టు సమాచారం. ఇక, వీరు బీజేపీలో చేరిన అనంతరం, పలు పార్లమెంట్‌ స్థానాల్లో వీరికే సీట్లు ఇస్తున్నట్టు పలువురు పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. 

సీఈసీ పరిశీలనలో ఉన్న పేర్లు 
1. మహబూబ్‌నగర్‌ :డీకే అరుణ
2. మహబూబాబాద్ : సీతారాం నాయక్
3. ఖమ్మం : జలగం వెంకట్రావుఔ
4. ఆదిలాబాద్ : నగేష్ 
5. వరంగల్ : కృష్ణ ప్రసాద్
6. నల్గొండ: మనోహర్ రెడ్డి 
7. పెద్దపల్లి : ఎస్ కుమార్/ మిట్టపల్లి సురేంద్ర  
8. మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement