కమలంలో ‘ప్రొటోకాల్‌’ కలకలం! పైకి అంతా బాగా ఉన్నట్టు కనిపిస్తున్నా..

Telangana BJP Internal Group Fights Raghunandan Complaints Over Protocol - Sakshi

బయటపడుతున్న గ్రూపు తగాదాలు  

తనను అవమానిస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌ అసంతృప్తి  

సాక్షి, హైదరాబాద్‌: కమలం పార్టీలో ప్రొటోకాల్‌ కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీలో అంతా బాగానే ఉన్నట్టుగా పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా గ్రూపు తగాదాలు బయటపడుతున్నాయి. ప్రజాసంగ్రామ యాత్ర–2 ప్రారంభానికి ముందే ఇలాంటివి వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా పాదయాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తనను వేదికపైకి పిలవకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు.

తమకు గౌరవం, ప్రాధాన్యతనివ్వడం లేదంటూ కొన్నిరోజుల క్రితం వివిధ జిల్లాల్లోని పలువురు సీనియర్‌ నేతలు ఇటీవల సమావేశాలు నిర్వహించగా, జాతీయపార్టీ వారిని బుజ్జగించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన రూపంలో అసంతృప్తి బట్టబయలైంది. తన ఫిర్యాదును పరిష్కరించకపోతే జాతీయ నాయకత్వాన్ని ఆశ్రయించాలని, వారం రోజుల్లో తగిన స్పందన రాకపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రఘునందన్‌ భావిస్తున్నట్టు తెలిసింది.

గతేడాది తొలివిడత ›ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి మొదలు పెడితే ము గింపు సభ హుస్నాబాద్‌ దాకా, ఆ తర్వాత మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం దాకా పదిసార్లు అవమానాలు ఎదురయ్యాయని ఆయన తన అనుయాయులతో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొందరు ముఖ్యనేతలు ఇతర ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కించపరుస్తూ తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ఒంటెద్దు పోకడపోవడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్టు తెలిసింది.    
(చదవండి: తెలంగాణ జడ్జీల స్థానంలో ఆంధ్రా జడ్జీలు? )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top