రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. వైఎస్సార్‌పీపీ నేతపై దాడి | Tdp Leaders Attack Ysrcp Leader In Palnadu District | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. వైఎస్సార్‌పీపీ నేతపై దాడి

Nov 10 2024 7:37 PM | Updated on Nov 10 2024 8:05 PM

Tdp Leaders Attack Ysrcp Leader In Palnadu District

సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గుండాలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత నర్రెడ్డి లక్ష్మా రెడ్డిపై కత్తులు, ఇనుపరాడ్డులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మా రెడ్డిని అంతమొందించాలనే పథకంతో టీడీపీ నాయకులు ఊరి చివర మాటు వేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement