బీఎస్పీ గ్రేటర్‌ అధ్యక్షుడిగా రుద్రవరం సునీల్‌

Rudravaram Sunil Appointed Bahujan Samaj Party Hyderabad President - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బహుజన్ సమాజ్‌ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడిగా ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థి రుద్రవరం సునీల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కో– ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. రుద్రవరం సునీల్‌ సామాజిక ఉద్యమాలు, సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిగా కొనసాగుతున్నారు.

ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన కోసం నిర్మాణాత్మక కార్యక్రమాలతో ముందుకు సాగుతానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ.. అణగారిన వర్గాలను సమీకరిస్తూ.. గ్రేటర్‌లో బీఎస్సీ బలోపేతానికి చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరిస్తానన్నారు. బీఎస్సీ రాష్ట్ర చీఫ్‌ కో– ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్‌: గ్రేటర్‌ జిల్లాలకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు వీరే.. ముగ్గురూ ముగ్గురే..)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top